చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులు..
న్యాయ చైతన్య సదస్సులో జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు స్పష్టం..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘ సభ్యులు ఎవరైనా అరాచకాలకు పాల్పడితే చట్టరీత్యా తీసుకోబడతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివి న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు పేర్కొన్నారు.. చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అందుకు అనుకూలంగా నడుచుకోవాలని ఆయన సూచించారు... నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామం, ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు.. ఈ న్యాయ చైతన్య సదస్సు లో భాగంగా చట్టాలు, గౌరవ న్యాయస్థానం పెట్టాలని ప్రతి ఒక్కరి గౌరవించాలని సూచించారు.. గ్రామ అభివృద్ధి కమిటీ, కుల సంఘాల కమిటీల ఎలాగైనా ఏ పేరుతోనైనా అరాచకాలకు పాల్పడితే న్యాయస్థానం ద్వారా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.. న్యాయ చైతన్య సదస్సులో భాగంగా చట్టాలపై అవగాహన కల్పించారు.. ప్రతి ఒక్కరూ గౌరవ న్యాయస్థానం కల్పిస్తున్న చట్టాలను గౌరవించి నడుచుకోవాలని సూచించారు.. లేనిపక్షంలో చట్టాలను అతిక్రమించిన వారు శిక్ష అర్హులని తెలిపారు.. ఈ న్యాయ చైతన్య సదస్సులో ఆర్మూర్ ఏసిపి జే. వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్, నందిపేట్ ఎస్ హెచ్ ఓ శ్యామ్ రాజ్, నర్రా రామారావు, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, శ్రీకాంత్ నారాయణ గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు..
About The Author
Related Posts
