బుమ్రా నీడలో మరిచిపోయిన సిరాజ్‌ ప్రతిభ

బుమ్రా నీడలో మరిచిపోయిన సిరాజ్‌ ప్రతిభ

‘మర్రి చెట్టు నీడలో మొక్కలు పెరుగవు’ అనే సామెత సిరాజ్‌ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. జస్‌ప్రీత్‌ బుమ్రా వెలుగులో మహ్మద్ సిరాజ్‌కు తగిన గుర్తింపు రాలేదని అభిమానులు అంటున్నారు. వేగం, స్వింగ్‌, ఫిట్‌నెస్‌ ఏ కోణంలోనైనా బుమ్రాకు తక్కువేం కాదు. 2020లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసినప్పటి నుంచి సిరాజ్‌ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

స్వింగ్ సుల్తాన్ సిరాజ్
ఇన్‌స్వింగ్‌, ఔట్‌స్వింగ్‌, వాబుల్‌సీమ్‌… ఏ బంతికైనా సిరాజ్‌ మాస్టర్‌. 38 టెస్టుల్లో 109 వికెట్లు తీశాడు. బుమ్రా ఉన్నప్పుడు 33.82 సగటు, కానీ బుమ్రా లేకుండా ఆ సగటు 25.20 కి దిగొచ్చింది. అంటే బుమ్రా లేనప్పుడే అతని అసలైన ప్రతిభ వెలుగులోకి వస్తోంది.

 విదేశాల్లో అసలైన ఆయుధం
స్వదేశపు స్పిన్ పిచ్‌లకంటే విదేశాల్లోనే సిరాజ్‌ ప్రభావం ఎక్కువ. తీసిన 109 వికెట్లలో 90 విదేశాలవే.

 ఎడ్జ్‌బాస్టన్‌ చరిత్ర
ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో, నిర్జీవ పిచ్‌పైనే సిరాజ్‌ ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ తరుగులేపాడు. రెండు వరుస బంతుల్లో రూట్‌, స్టోక్స్‌లను ఔట్‌ చేయడం అభిమానులు మరచిపోలేరు.

తిరస్కారమే ప్రేరణగా
బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ తర్వాత చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక కానప్పుడు, తన ప్రతిభను రంజీల్లో మరియు IPLలో ప్రూవ్‌ చేసుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున 16 వికెట్లు తీశాడు.

 ఫీల్డింగ్‌లోనూ మెరుపులు
బర్మింగ్‌హామ్‌ టెస్టులో జడేజా బౌలింగ్‌లో జోష్‌ టంగ్‌ క్యాచ్‌ను ఒక్కచేత్తో దొరికించడం ‘జాంటీ సిరాజ్’ అనే సచిన్‌ కామెంట్‌కు కారణం.

Tags:

About The Author

Latest News

విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం
లోకల్ గైడ్: ఖమ్మం: వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ – ఖమ్మం (విహే) ఆధ్వర్యంలోమహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా...
నాణ్యమైన ఆహారాన్ని తాజాగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు.....
కొయ్యడ మల్లేష్ కు ముచర్ల సత్తన్న పురస్కారం..  
బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజల వద్దకే వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...
సిద్దిపేటలో మీడియా అకాడమీ శిక్షణా తరగతులు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ...
నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.