మాటలు రావడం లేదు" – తొక్కిసలాట విషాదంపై విరాట్ కోహ్లీ స్పందన

మాటలు రావడం లేదు

పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును సత్కరించేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమం దురదృష్టవశాత్తూ విషాదంలోకి మారింది. చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది వరకు గాయపడ్డారు.ఈ ఘటనపై దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆర్‌సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ విషాదంపై స్పందిస్తూ –
"మాటలు రావడం లేదు. ఈ ఘటన నా మనస్సును తీవ్రంగా కలిచివేసింది" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, ఆర్‌సీబీ యాజమాన్యం కూడా ఈ విషాద ఘటనపై అధికారికంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
"ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సే మా ప్రాధాన్యం. ఈ ఘటన మనల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది" అని పేర్కొంది.

విజయోత్సవాన్ని ఓ విషాదం మసకబార్చిన ఈ ఘటనపై దేశమంతా దిగ్భ్రాంతితో స్పందిస్తోంది.

Tags:

About The Author

Latest News

విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం
లోకల్ గైడ్: ఖమ్మం: వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ – ఖమ్మం (విహే) ఆధ్వర్యంలోమహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా...
నాణ్యమైన ఆహారాన్ని తాజాగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు.....
కొయ్యడ మల్లేష్ కు ముచర్ల సత్తన్న పురస్కారం..  
బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజల వద్దకే వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...
సిద్దిపేటలో మీడియా అకాడమీ శిక్షణా తరగతులు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ...
నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.