ఉప్పు మోతాదు మించి తింటున్నామా?

ఉప్పు మోతాదు మించి తింటున్నామా?

లోక‌ల్ గైడ్: ఉప్పు లేకుండా ఏ వంటకం పూర్తి కాదు. కూరల్లో కొంచెం తక్కువైనా వంటవాడు కామెంట్లకు లోనవుతాడు. కానీ, మనం అవసరమైన దానికంటే ఎక్కువగానే ఉప్పు తింటున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.

 ప్రతి రోజూ ఎంత ఉప్పు సరిపోతుంది?
WHO ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాములు (ఒక టీస్పూన్) ఉప్పు తినాలి. ఇందులో సుమారు 2 గ్రాముల సోడియం ఉంటుంది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, రోజుకు 1.5 గ్రాముల సోడియం అవసరం. అంతకంటే ఎక్కువైతే హై బీపీ, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

 మన దేశంలో పరిస్థితి?
సర్వేలు చెబుతున్నట్లు, ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి రోజుకు 9–12 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నాడు. భారత్‌లో సగటున 10.9 గ్రాములు. చైనాలో 11 గ్రాములు, అమెరికాలో 8.5 గ్రాములు. అంటే WHO సూచన కన్నా రెట్టింపు.

 ఎందుకు ప్రమాదం?
ఉప్పు మోతాదు ఎక్కువైతే,

    హై బీపీ

    గుండె పోటు

    కిడ్నీ రోగాలు

    జీర్ణాశయ క్యాన్సర్

    ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది.

2021లో న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో వెలువడిన అధ్యయనం ప్రకారం, రోజూ 1 గ్రాము ఎక్కువ సోడియం తీసుకున్నా, గుండె జబ్బుల వల్ల మరణాల రిస్క్ పెరుగుతుంది. 2030 నాటికి 90 లక్షల మంది గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 ఎ foods తగ్గించాలి?
ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు:
ఊరగాయలు
 అప్పడాలు
 చట్నీలు
 ప్యాక్డ్ foods (చిప్స్, బిస్కెట్లు, బ్రెడ్)
 రెస్టారెంట్ మీల్స్
 బటర్, చీజ్

ఈ foods తక్కువ చేయడం వల్ల గుండెను, కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Tags:

About The Author

Latest News

పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం... పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా
గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...
పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేసిన కర్కటకుడైన కొడుకు...
మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన షేక్ ఫెరోజ్ కు ఏడు రోజుల జైలు శిక్ష...
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులు..
మృత్యువు కూడా వీడదీయనిది మూడు మూడుముళ్ళ బంధం...
కల్తీకల్లుతో ఐదుగురు మృతితో అప్రమత్తమైన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు...