"సూర్య 46"

తమిళ స్టార్ హీరో సూర్య తన తాజా సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఇటీవల రెట్రో కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య, ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి "సూర్య 46" అనే ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ చేపట్టారు.ఇటీవల పళ్ని మురుగన్ ఆలయంలో చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అధికారికంగా షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా సూర్యకు జోడీగా నటిస్తున్నారు. అలాగే రవీనా టాండన్, రాధిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి