పేదోడి కల సహకరమైన శుభ వేళ

నూతన గృహ ప్రవేశానికి హాజరైన ఆర్బిఓఎల్ సీఈవో.

పేదోడి కల సహకరమైన శుభ వేళ

కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్.

లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్, మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన తోపోజీ లక్ష్మీ శేఖర్ లకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించిన రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. బుధవారం మంచి ముహూర్తం ఉండడంతో నూతన గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డితో పాటు కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ ఎస్. నారాయణ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజాలో పాల్గొన్నారు.అనంతరం నూతన గృహంలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మా సొంతింటి కళ సహకారమైంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మా కుటుంబం మనోహర్ రెడ్డి వెంట ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంబాపూర్ శ్రీనివాస్ రెడ్డి, అశోక్, మైఫుజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News