నాయకుడిని కాదు సేవకుడుని  కౌన్సిలర్ ఆదిఅజయ్ కుమార్

నాయకుడిని కాదు సేవకుడుని  కౌన్సిలర్ ఆదిఅజయ్ కుమార్

మూడు చింతలపల్లి : లోకల్ గైడ్ :
ఆద్రాస్ పల్లి 22వ వార్డు కౌన్సిలర్ ఆది అజయ్ కుమార్ గురువారం గ్రామ దేవతలకు మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జామ్ రవి  పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు 13 వార్డు  విష్ణువర్ధన్ రెడ్డి, 14వ వార్డు జంగారెడ్డి, 12వ వార్డు మౌనిక శివప్రసాద్, 11వ వార్డు కొల్లాస్ రాజు, 6వార్డు నీరజ్ గౌడ్, 19 వార్డు గిరిపల్లి రమేష్,18 వార్డు గిరిపల్లి జ్యోతి స్వామి, మాజీ సర్పంచ్ బోయిని లలిత నర్సిములు, శ్రీపతి నర్సింలు, శ్రీపతి పున్నయ్య, రంగా నాగేష్, గ్యార బిక్షపతి, గ్యార మల్లేష్, చిలక మల్లేశ, యంజాల బాలయ్య, మున్సిపల్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 22 వార్డు కౌన్సిలర్ పాల్గొని మాట్లాడుతూ  నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా భావిస్తానని, వార్డులో చాలామంది చదువుకున్న యువతి యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తానని అలాగే నా వార్డు సంబంధించిన ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా పనిచేస్తానని, 22వ వార్డులో కొన్ని సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, వారి దృష్టికి వచ్చిందని, కచ్చితంగా అన్ని సమస్యలు మున్సిపల్ చైర్మన్ సహకారంతో తొందరలోనే తీరుతాయని మాట ఇస్తున్నానని అన్నారు. చదువు తోనే కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతుందని, వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
      మిర్యాలగూడ మార్చి 9   (లోకల్ గైడ్ తెలంగాణ)   భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సమావేశం వై పద్మ అధ్యక్షతన జరిగింది . ఈ
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
శీతాకాల ప్రత్యేక శిబిరం. 
ప్రయాణికులపై డ్రైవర్ ప్రతాపం  చేయి ఎత్తినా ఆగని ఆర్టీసీ చక్రం!
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రైతు వేదికకు మహర్ధష 
_భగవాన్ శ్రీ అనంత విష్ణు దేవప్రభు  ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ దోహదం