శేరిలింగంపల్లి జోన్‌లో ప్రజావాణి లో24 వినతులు స్వీకరణ
తక్షణ చర్యలకు జోనల్ కమిషనర్ హేమంత్ భోర్ఖడే ఆదేశం
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ వెస్ట్ జోన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ): శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. జోనల్ కార్యాలయంతో పాటు నార్సింగ్, అమీన్ పూర్, పటాన్ చేరు, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 24 వినతులు అధికారులకు అందాయి. ఇందులో జోనల్ కార్యాలయం లో 5, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 8, నార్సింగ్ సర్కిల్ కార్యాలయంలో 3, మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో 5, అమీన్ ఆర్ సర్కిల్ కార్యాలయంలో 3 వినతులు వచ్చాయి. పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన వినతులపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, క్షేత్రస్థాయిలో పరిశీలనలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు తెలియజేయాల ని సూచించారు. జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వినతులను స్వీకరించారు.
