సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మొత్తం 196 మందిని పట్టుకున్నారు. వాహనాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు-140, త్రిచక్ర వాహనాలు-13, నాలుగు చక్రాల వాహనాలు- 41, భారీ వాహనాలు-02. రక్తంలో మద్యం శాతం (బ్లడ్ ఆల్కహాల్ కన్‌సెంట్రేషన్) స్థాయిల వారీగా: ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 36 మిల్లీగ్రాములు నుంచి 200 మిల్లీగ్రాములు-157 మంది, ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 201 మిల్లీగ్రాములు నుంచి 300 మిల్లీగ్రాములు -26 మంది, ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 301 మిల్లీగ్రాములు నుంచి 550 మిల్లీగ్రాములు-13 మంది, పట్టుబడిన వారిని న్యాయ స్థానంలో హాజరు పరచనున్నా రు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదం కలిగించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై బిఎన్ఎస్, 2023 లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్ఠంగా పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది. గత వారం (2026 ఫిబ్రవరి 09నుంచి 2026 ఫిబ్రవరి 14 వరకు) కోర్టు తీర్పులు: మొత్తం 212 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కరించబడ్డాయి. జైలు, జరిమానా-0 మంది, జరిమానా, సామాజిక సేవ-6 మంది, జరిమానా మాత్రమే,-206 మందికి విధించారు.