కెసిఆర్ జన్మదిన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ. 

అంకుటిత దీక్షతో పోరాటం కొనసాగించి ,ప్రాణాలను సైతం వెరవక..ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు, తెలంగాణ జాతిపిత కెసిఆర్.

కెసిఆర్ జన్మదిన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ. 

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17 (లోకల్ గైడ్)


తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి... కల్వకుంట చంద్రశేఖర రావు 72 వ జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
ఘనంగా వేడుకలు నిర్వహించారు.పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానుల హర్షద్వానాల మధ్య నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కెసిఆర్ జన్మదినము అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగని,అకుంఠిత దీక్షతో పోరాటం కొనసాగించి, ప్రాణాలకు సైతం వెరవక.. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని,సాధించిన పోరాట యోధుడని, తెలుగు జాతి పిత అని.. కొనియాడారు. రాదే రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి, వ్యవసాయ విద్యుత్, ఐటీ రంగాల్లో  అభివృద్ధి సాధించడమే కాకుండా, యువతకు ఉద్యోగాల కల్పనలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కొరకు,కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు, రైతుబంధు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసిఆర్ కిట్ లాంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను..  అమలుపరచి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని, గత రెండున్నర సంవత్సరాలుగాకాంగ్రెస్ హయాంలో. అభివృద్ధి ఆగిపోయిందని సంక్షేమం అటకెక్కిందని.. రైతులు ఉద్యోగులు మహిళలు పెన్షనర్లు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సంబండ వర్గాల వారు మళ్లీ కేసీఆర్ రావాలని కేసీఆర్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని..అన్నారు.వారు మంచి ఆయురారోగ్యాలతో.. మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని, తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా వారికి.. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ  నల్లగొండ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నామని అన్నారు.
 అంతకుముందు ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రివద్ద... నగర అధ్యక్షులు బోనగిరి దేవేందర్ రోగులు వారి బంధువులకు ఆల్పాహారం కెసిఆర్ జన్మదిన సందర్భంగా అందజేశారు..
 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు
 రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీరా పంకజ్ యాదవ్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి.. మాజీ ఆర్.ఓ మాలే శరణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి,నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, కంచనపల్లి రవీందర్ రావు, లొడంగి గోవర్ధన్  నగర పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ నల్గొండ పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్ బక్క పిచ్చయ్య, మారగోని గణేష్   కార్పొరేటర్ లు గోపగోని స్వాతి రాజశేఖర్, పెరిక యాదయ్య దొడ్డి రమేష్, రత్నగిరి శ్రీనివాస్ కుందూరు ప్రవీణ్ రెడ్డి ... రావుల శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి బొజ్జ వెంకన్న గుండబోయిన జంగయ్య, బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య, సింగం లక్ష్మి కొండ్ర స్వరూప మర్రి రేణుక కంచర్ల విజయ, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయన నాగర్జున, కంకణాల వెంకటరెడ్డి, తో పాటు పలువురు సర్పంచులు నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు