బంజారా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి

వేడుకలలో పాల్గొన్న మారబోయిన రవి యాదవ్

బంజారా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ వెస్ట్ జోన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ): లింగంపల్లి హుడా ఫేజ్-2లో ఘనంగా నిర్వహించిన బంజారా సమాజ ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి మహోత్సవాలలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, శేరిలింగంపల్లి ఉమ్మడి మూడు డివిజన్ల ఇంచార్జ్ మారబోయిన రవి యాదవ్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారా సమాజ ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బంజారా సమాజ గౌరవం, ఆత్మగౌరవం, ధైర్యానికి ప్రతీక సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయన ఆశీస్సులతో సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అని మారబోయిన రవి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.ఎన్.రాములు, గడ్డం శ్రీనివాస్, సురేష్ యాదవ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, వాకిటి శంకర్, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రాంబాబు, మాజిద్ తదితర బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, బంజారా సమాజ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News