నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్
ఖమ్మం లోకల్ గైడ్
స్థానిక కవిరాజ్ నగర్ 13 వీధిలో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎకాడమిక్ ఫెయిర్ (సైన్స్ ఫెయిర్) నిర్వహించారు.పాఠశాల ఆవరణంలో విద్యార్థులు ఉత్సాహంగా సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నారు. పలు సృజనాత్మక మరియు విన్నూత ప్రాజెక్టులను ప్రదర్శించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, మొబైల్ హాస్పిటల్, మ్యాథ్స్ పార్క్, న్యాయశాఖ నమూనాలు, రోబోటిక్స్, సౌరశక్తి వినియోగం, బ్రహ్మోస్ క్షిపణి ,వ్యవసాయ సాంకేతిక వంటి అంశాలపై విద్యార్థుల మోడల్స్ మరియు ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ప్రాజెక్టు వెనుక ఉన్న శాస్త్ర సూత్రాలను విద్యార్థులు స్పష్టంగా వివరించడం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇ .వెంకటేశ్వరరావు (ఎన్.సి.ఎస్.సి కోఆర్డినేటర్), డాక్టర్. కే. రమేష్ (మెడికల్ ఆఫీసర్) మాట్లాడుతూ విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం మరియు సృజనాత్మకత పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నారాయణ విద్య సంస్థల ఏ.జీ.ఎం ఎస్. రాంకీ , ఆర్ అండ్ డి హెడ్స్ అనిల్ కుమార్, రాజేశ్వరరావు, ఆర్.ఐ క్రాంతి కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ అమలోద్భవి ,కో_ఆర్డినేటర్స్ ప్రవీణ్ కుమార్, వినోదలక్ష్మీ, నీలిమ , పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
