కరాటే బ్రోచర్ ఆవిష్కరణ
By Ram Reddy
On
ఖమ్మం లోకల్ గైడ్
ఖమ్మం పట్టణంలోని స్థానిక విద్యాసంస్థ త్రివేణి టాలెంట్ స్కూల్లో రెండు రాష్ట్రాల కరాటే ఛాంపియన్షిప్ పోటీలకి సంబంధించి బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ వినోద్ గారు మాట్లాడుతూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల కరాటే ఛాంపియన్షిప్ వచ్చేనెల 15వ తారీకు బైపాస్ రోడ్ ఎంబి గార్డెన్స్ నందు జరుగుతుందని, దీనికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ తుమ్మల యుగంధర్ గారు పాల్గొనబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాలలోని కరాటే విద్యార్థులతో పాటు మిగిలిన పాఠశాల యొక్క విద్యార్థులు కూడా పాల్గొని విజేతగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అలాగే పాఠశాల కరాటే కోచ్ వీరన్న మరియు ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags:
