సమాజ మార్పుకు సాధనం సైన్స్.
విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ రంగాలలో ఆసక్తి పెంచుకోవాలి. - అధ్యక్షులు ఉదయ్ శంకర్ పటేల్.
శివసాగర్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు.
లోకల్ గైడ్/ తాండూర్:
సమాజ మార్పుకు ముఖ్య సాధనం సైన్స్ అని విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలలో ఆసక్తి పెంచుకోవాలని ఉదయ్ శంకర్ పటేల్ తెలిపారు. శనివారం తాండూర్ పట్టణంలోని శివసాగర్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో
భారత శాస్త్రవేత్త సి.వి. "రామన్ ఎఫెక్ట్" ఆవిష్కరణకు గౌరవార్థంగా... పాఠశాలలోని విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు, ప్రయోగాల ప్రదర్శనలు, వ్యాసరచన, వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పటేల్, కరస్పాండెంట్ కిరణ్ మాట్లాడుతూ... శాస్త్రం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు పరిశోధనా దృక్పథం పెంపొందించుకోవాలని, ప్రశ్నించే స్వభావం అలవరుచుకోవాలని సూచించారు. శాస్త్రీయ ఆలోచన విధానం వ్యక్తిగత అభివృద్ధికే కాక, సమాజ పురోగతికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉదయ శంకర్ పటేల్, కరస్పాండెంట్ కిరణ్, డైరెక్టర్ వినయ్, ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు రాజు, జయలక్ష్మి, శ్రీశైలం, అనూష, మాధవి, అన్నపూర్ణ, మంజు, భార్గవి, జ్యోతి, అనిత, హిమలత, లీలా, సుధా వెంకటేష్, రామ్ రెడ్డి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
