సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.
నిరాధార ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తా ...దొడ్ల ఈశ్వర్ రెడ్డి.
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా తాను వ్యవహరించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. నాకు 18వ వార్డు ఇన్చార్జిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. నేను ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంతో పాటుగా ఇతర వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నా వంతుగా ప్రయత్నించాను. ఇందులో భాగంగా 19 వ వార్డులోనూ కొందరికి నేను ఫోన్ చేయగా అందులో కొందరు ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయము, బీఅర్ఎస్ పార్టీకే వేస్తామని చెప్పారని, అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో బిజెపి పార్టీకి వేయాలని వ్యూహాత్మకంగా మాత్రమే తాను చెప్పాను. ఇందులో నేను మాట్లాడిన పూర్తి మాటలు లేకుండా కొద్దిగా మాత్రమే కట్ చేసి ఆడియో రూపంలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కొందరు ఈ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. ఈ విషయంలో నేను పార్టీకి అంతర్గతంగా సమాధానం ఇస్తాను. రాజకీయంగా నా శత్రువులు చేసే ఈ చర్యలను నేను చాలానే చూశాను. పార్టీ ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకున్న నేను సమాధానం చెప్పి కట్టుబడి ఉంటాను. వ్యక్తిగతంగా, రాజకీయ నాయకునిగా నా నిజాయితీ, క్రమశిక్షణ సుదీర్ఘ ప్రయణంలో నాతోపాటు కలిసి పని చేసిన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటి చీఫ్ ట్రిక్స్ కు పాల్పడితే సహించను. చట్ట ప్రకారం చర్యలకు సిద్దం కావాల్సి ఉంటుంది.
