సూధనపల్లి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం...

సూధనపల్లి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం...

 

లోకల్ గైడ్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూధనపల్లి లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ అయిన శ్రీ ధరావత్ వెంకన్న  అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వెంకన్న సార్ ను తోటి ఉపాధ్యాయులంతా మెమొంటో ,శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకన్న మాట్లాడుతూ  ఈరోజున ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త  అయిన భారతదేశానికి చెందిన సర్ సి.వి.రామన్  రామన్ ఎఫెక్ట్ ను ఆవిష్కరించిన రోజు , ఈ రామన్ ఎఫెక్ట్ ద్వారా సి.వి .రామన్  నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ రోజును పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28 ని జాతీయ సైన్స్ దినోత్సవం గా జరుపుకోవాలని సూచించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్, ఎండి .అంజద్ పాషా, గాండ్ల బాలరాజు, బి. సరోజ, వి.శుభ, కే. సారంగం ,ఏ .ప్రగతి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎల్లమశెట్టి ధనమ్మ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News