శ్రీ జమ్ములమ్మ వారికి వెండి కిరీటము బహూకరణ.

స్వయంభూగా వెలసినశ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి ఆలయానికి దాతలు వెండి కిరీటాన్ని అందజేశారు.

శ్రీ జమ్ములమ్మ వారికి వెండి కిరీటము బహూకరణ.

గద్వాల, లోకల్ గైడ్:
జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు సమీపంలో స్వయంభూగా వెలసినశ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి ఆలయానికి దాతలు వెండి కిరీటాన్ని అందజేశారు. గద్వాల పట్టణానికి చెందిన  నర్మదా రాజశేఖర్ రెడ్డి సుమారు 700 గ్రాముల  బరువు గల మిశ్రమ వెండి కిరీ టాన్ని శుక్రవారం శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ ఆర్. పురెందర్ కుమార్ దాతలు అమ్మవారికి ఇచ్చిన వెండి కిరీటాన్ని తీసుకున్నారు. అనంతరం నర్మదా రాజశేఖర్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఎల్లప్పుడూ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆలయ ఈఓ కోరారు.

Tags:

About The Author

Latest News