జహీరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్-3లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి శుక్లవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, అభ్యర్థి శ్రీధర్ రెడ్డి, నవారి భుజంగ రెడ్డి, రెడ్డి రాంచందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పేర్కొంటూ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని నాయకులు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తమ మద్దతు ప్రకటించారు. ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో వార్డు నెంబర్-3లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.