మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరు.
వైస్ చైర్మన్‌గా అందె మోహన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా
మర్యాదపూర్వకంగా పూల బొక్కెనతో శాలువాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది
లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా
షాద్‌నగర్ పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం ఘనంగా కొలువుదీరింది. జరిగిన ఎన్నిక ప్రక్రియలో మున్సిపల్, వైస్ చైర్మన్‌గా అందె మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మున్సిపల్ కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి షాద్‌నగర్ నియోజకవర్గ స్థాయి నేతలు, పట్టణ ప్రముఖులు పురప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యాలయం ప్రాంగణమంతా కార్యకర్తల కోలాహలం, బాణసంచా సందడితో పండుగ వాతావరణం నెలకొంది. నూతనంగా ఎన్నికైన వైస్ చైర్మన్ అందె మోహన్‌లకు సీనియర్ నాయకులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. షాద్‌నగర్ పట్టణ అభివృద్ధిలో నూతన పాలకవర్గం చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. మరియు పట్నం ప్రతాప్ శ్రీనివాస్ శివ అందే మోహన్ యువసేన శ్రీశైలం రవితేజ గణేష్ అప్ప ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
