తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా
నగరంలోని సీటి సెంట్రల్ లైబ్రరీ గేట్ ముందు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
By Ram Reddy
On
హైదరాబాద్ లోకల్ గైడ్ :
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు పండ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల అభ్యున్నతికి కేసీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు మాట్లాడారు.
కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, యాదగిరి, వంశీ, కుమార స్వామి, నరేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Feb 2026 22:14:06
కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్.
