గ్రామపంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలి 

ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కృషి చేయాలని ఎంపీడీవో లెంకల గీతారెడ్డి అన్నారు.

గ్రామపంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలి 

తుర్కపల్లి, ఫిబ్రవరి 17 (లోకల్ గైడ్ )

గ్రామ పంచాయితీ అభివృద్ధికి ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కృషి చేయాలని ఎంపీడీవో లెంకల గీతారెడ్డి అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీలను అభివృద్ధి పరిచే అనేక అంశాల గురించి నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఉపసర్పంచ్లు ,వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామానికి వచ్చే నిధులతో  చేయవలసిన అభివృద్ధి పనుల గురించి ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్స్ శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. 17 గ్రామాలకు చెందిన 120 మంది హాజరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ,మాస్టర్ ట్రైనర్స్ సాయికుమార్, ఎండి అల్తాఫ్ ,పవన్ కుమార్ ,గణేష్ ,జూనియర్ అసిస్టెంట్లు జహంగీర్, సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News