గద్వాల వాసికి డాక్టరేట్ అవార్డు.
గద్వాల, లోకల్ గైడ్:
గద్వాల వాసికి డాక్టరేట్ అవార్డు వరించింది. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఏ.రఘువర్ధన్ తండ్రి ఏ.ఊశన్న (రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్), ఏ.ఈశ్వరమ్మ ల కుమారుడు నివాసం ఉంటున్నారు. ఇటీవల 2026 ఏడాదికి గాను ప్రొఫెసర్,పి. నారా హరి శాస్త్రి సారథ్యంలో "ఎనాలిసిస్ అండ్ ఐడెంటిఫికేషన్ అఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఫాబ్రిక్ టెక్సర్ యుసింగ్ పాటర్న్ రెకగ్నిషన్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్". అనే అంశం పై ఏ. రఘువర్ధన్ పరిశోధన పూర్తి చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుండి ఈనెల 11న ఆయనకు డాక్టరేట్ అవార్డు అందించారు. ఈయన విద్యాభ్యాసం జిల్లా కేంద్రంలోని నవోదయ పాఠశాలలో చదివి, మహబూబ్నగర్ లోని జిపిఎస్ లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం లో పీ హెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. గద్వాల వాసికి డాక్టరేట్ రావడం పట్ల జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలతోపాటు రఘు వర్ధన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
