ఘనంగా యువనేత నల్లమోతు సిద్దార్థ పుట్టినరోజు వేడుకలు

కేక్ కట్ చేసి తినిపించిన భాస్కర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు 

ఘనంగా యువనేత నల్లమోతు సిద్దార్థ పుట్టినరోజు వేడుకలు

మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు 

 మిర్యాలగూడ ఫిబ్రవరి 17
 (లోకల్ గైడ్ తెలంగాణ)

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ పుట్టినరోజు వేడుకలు  మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తన తనయుడు నల్లమోతు సిద్దార్థ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి నల్లమోతు సిద్దార్థకు తినిపించారు. నల్లమోతు సిద్దార్థ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణులు  సంబురాలు జరుపుకున్నారు. అనంతరం యువజన నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి,కౌన్సిలర్ దినేష్, షోయబ్, తదితరులు పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News