మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి 

యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీహరి మరో మారు మానవత్వాన్ని చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి 

నారాయణపేట మార్చి 12:
ఆపదలో ఉన్న వారిని ఆదు కోవడమే ధ్యేయంగా మారు రాష్ట్ర పాడి, మత్స్య పరిశ్రమ,క్రీడలు యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీహరి మరో మారు మానవత్వాన్ని చాటుకున్నారు.గురువారం ఉదయం బెంగళూరు జాతీ య రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన బైకు ప్రమాదం లో  ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.అటుగా మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ ని ఆపి రోడ్డుపై  చెల్లాచెదు రుగా పడి ఉన్న మృతదేహా లను తన సిబ్బంది తో కలిసి తాను స్వయంగా పక్కకు తీశారు. చూడటానికి ఆ ఇద్ద రు యువకుల మృతదేహాలు తలలు పగిలి భీతాహావకర పరిస్థితి లో ఉన్నాయి. అధి కారిక పర్యటన కు వెళ్తున్న మంత్రి తన చేతికి రక్తపు మరకలు అంటుతున్నా వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ డెడ్ బాడీ లను పక్కకు జరిపారు. అంబులెన్స్ ను పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. ప్రజా ప్రతినిధులు అంటే ఖద్దరు బట్టలు వేసు కొని కార్లల్లో తిరగడం కాదు... ఆపదలో ఉన్నవా రిని తక్షణమే ఆదుకోవడ మని అందరికీ తెలిసేలా చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. సహాయక చర్యలు చేపట్టిన మంత్రి పై ప్రయాణికులు ప్రశంసల జల్లు కురిపించారు.
ఫోటో రైట్ అప్:1.శవాలను రోడ్డు పక్కకు చేరుస్తున్న మంత్రి శ్రీహరి 
______________________

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ