శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో మాతా పురస్కార్ అవార్డ్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయా రెడ్డి హాజరు
కుత్బుల్లాపూర్ మార్చి 11 ( లోకల్ గైడ్ ప్రతినిధి)
రవీంద్ర భారతి లో శ్రీమాతా సేవ సమితి ఆధ్వర్యంలో మాతా పురస్కార్ అవార్డ్స్ వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు చేసిన ప్రముఖులకు ఈ అవార్డ్స్ అందజేయడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కార గ్రహీతలకు ఈ అవార్డ్స్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని కృషి శ్రీ మాత సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కుసుమ మాధవి సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా మాతా పురస్కార్ అవార్డు సమాజాభివృద్ధికి తోడ్పడినటువంటి ప్రముఖ వ్యక్తులకు అవార్డును రవీంద్రభారతిలో అందజేయడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్పారు బి వీర రాఘవ చౌదరి సోషల్ యాక్ట్విస్ట్ అవార్డుని అందుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్. కుమారి, మాత సేవా సమితి వ్యవస్థాపకరాలు కుసుమ మాధవి, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవార్డు గ్రహీతలకు అవార్డుతో శాలువా తో సత్కరించారు తదితరులు పాల్గొన్నారు
