రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ

ఆదిత్య గ్లోబల్ స్కూల్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు

రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ

 

కుత్బుల్లాపూర్ మార్చి 21 (లోకల్ గైడ్ ప్రతినిధి)

తెలుగు నూతన సంవత్సర ఉగాది, శ్రీరామ నవమి పండుగల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బీరంగూడలోని ఆదిత్య గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. గ్లోబల్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ అధ్యక్షుడు లయన్ కె.వి. రమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు పి. నందిని, కె. మన్విత, కె. తేజశ్రీ, కె. జశ్వంత్, ఎమ్. నిఖిల్ టైక్వాండో సాహస విన్యాసాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన గణిత ఉపాధ్యాయురాలు సునిత మరియు టైక్వాండో మాస్టారు సూర్య విద్యార్థులు ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రమణారావు విద్యార్థులు మరియు మాష్టార్ల పేర్లను తెలుగు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడంతో పాటు ప్రశంసాపత్రాలతో సత్కరించారు.పాఠశాల డైరెక్టర్ హనీష్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు యోగా, మార్షల్ ఆర్ట్స్, కర్రసాము, టైక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఆటలు వంటి సహా పాఠ్య కార్యక్రమాలను అందిస్తూ వారి సర్వాంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్న ఆదిత్య గ్లోబల్ స్కూల్ బీరంగూడ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ