ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో BRS పార్టీ మరింత పటిష్టం దిశగా అడుగులు

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో BRS పార్టీ మరింత పటిష్టం దిశగా అడుగులు

ఖమ్మం( లోకల్ గైడ్
జిల్లా పార్టీ కార్యాలయంలో BRTU ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రైతుబజార్ అడ్డా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు* హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ… ఆటో కార్మికులు సమాజానికి కీలక సేవలు అందిస్తున్నారని, వారి సంక్షేమం కోసం కార్మిక సంఘాలు బలంగా ఉండాలని ఆయన అన్నారు. BRTU ఆటో యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండి పని చేస్తూ సంఘాన్ని మరింత అభివృద్ధి పరచాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పగడాల నాగరాజు విమర్శించారు. ఆటో కార్మికుల సంక్షేమం, భీమా, రుణ సదుపాయాలు, పార్కింగ్ స్థలాల వంటి సమస్యలపై సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

BRS పార్టీ ఎప్పటికీ కార్మికుల పక్షాన నిలబడుతుందని, ఆటో కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఐక్యంగా పని చేస్తూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని పగడాల నాగరాజు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో* BRTU జిల్లా నాయకులు ఎండివై పాషా, BRTU ఆటో యూనియన్ జిల్లా నాయకులు షేక్ సత్తార్ మియా, దడవాయి సంఘం అధ్యక్షులు కుమార్, ఆటో ట్యాలీ యూనియన్ అధ్యక్షులు స్వామి, BRTU జిల్లా నాయకులు షేక్ కలీం, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, జిల్లా నాయకులు జానీ భాయ్, రైతుబజార్ అడ్డా కమిటీ సభ్యులు తాటి వెంకటి (అధ్యక్షులు), అడ్డ వైస్ ప్రెసిడెంట్ పాషా, అడ్డ కార్యదర్శి జిలాని, జాయింట్ సెక్రటరీ నాని (నరేందర్), కోశాధికారి నాగరాజు, కమిటీ మెంబర్లు షరీఫ్ షేక్, షేక్ నన్నే, ఏ రవి, ఎండి దస్తగిరి (బబ్బులు) తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత
    కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి) జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్
అభివృద్ధి నిరంతర ప్రక్రియ....
శాఖాహారం అమృతహారం.
దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్ మత్రు నాయక్ 
ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి. 
రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి నుంచి తరలి వెళ్లిన
*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *