జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.
By Ram Reddy
On
పెద్దపల్లి : మార్చి,25,.(లోకల్ గైడ్)
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ నెల 28న న్యాయస్థాన ప్రాంగణంలో లోక్‌అదాలత్ జరుగుతుందని తెలిపారు. రాజీ పద్దతిలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, అన్నిరకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుని తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. రాజీ కుదిరితే, చెల్లించిన కోర్టు రుసుము, కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులు,రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. రాజీ మార్గం రాజమార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు
Tags:
About The Author
Latest News
25 Mar 2026 19:51:14
( లోకల్ గైడ్ షాద్ నగర్)
ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టిబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల...
