గర్భిణీ కి సకాలంలో ఏ పాజిటివ్ రక్తం అందజేత.

41 వ సారి రక్తదానం చేసిన రవికుమార్.

గర్భిణీ కి సకాలంలో ఏ పాజిటివ్ రక్తం అందజేత.

లోకల్ గైడ్ తెలంగాణా కామారెడ్డి ప్రతినిధి

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ శాఖని మీనా (28) అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో,వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్ మానవతా దృక్పథంతో స్పందించి 41 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.  ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రవికుమార్ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానంతో పాటుగా మూడు నుండి నాలుగు సార్లు తెల్ల రక్త కణాలను అందజేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నారని,ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్న రక్తదాత రవికుమార్ అభినందించడం జరిగింది. ఆపదలో ఉన్న వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలని అన్నారు.

Tags:

About The Author

Latest News