మన ఓటే మన ఆయుధం,  రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం.

బీసీ అభ్యర్థుల గెలుపుకు బేరి రామచంద్ర యాదవ్ పిలుపు.

మన ఓటే మన ఆయుధం,  రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం.

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లను కోరారు. మన ఓట్లు మనకే అనే బీసీ సూత్రం ప్రకారం పరస్పర సమన్వయంతో రిజర్వ్ స్థానాలలో ఆయా వర్గాల అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ, బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట అన్ని వర్గాల ఓట్లు సమీకరించి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పర్యటిస్తూ బీసీ ముఖ్య నాయకులను కలసి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ ఎన్నికలలో బీసీలు అధిక సంఖ్యలో గెలుపొందినట్లే మున్సిపల్ ఎన్నికలలో కూడా విజయం సాధించాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో బేరి రామచంద్ర యాదవ్‌తో పాటు సాయన్న ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి మారుతి ముదిరాజ్, ఆర్గనైజర్ సెక్రటరీ హరికృష్ణ చారి, రాష్ట్ర బీసీ నాయకులు అశోక్ గౌడ్, రమేష్, కిషోర్, కృష్ణ నేత, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News