భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకం - ఎల్కగూడెం  గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ చాకలి బందయ్య .                                   

రాజ్యాంగం స్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి లోకల్ గైడ్ ఎడిటర్. రామిరెడ్డి. చిలకమర్రి

 భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకం - ఎల్కగూడెం  గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ చాకలి బందయ్య .                                   

IMG-20260127-WA0022లోకల్ గైడ్ (జిల్లేడు చౌదరి గూడెం) : భారత రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ఇంకా కూడా సర్పంచ్ చాకలి బందయ్య అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, లక్ష్మీదేవి పల్లి, బోయగూడ,  గ్రామాల్లో ఆయన స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకి ఆదర్శనీయమని, ఈ రాజ్యాంగ స్ఫూర్తితోనే నేటి సమాజం ముందుకు సాగుతుందన్నారు. మనకు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1956 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభోదయం అని తెలిపారు. ఈ భారతదేశం భారత రాజ్యాంగం సూచన ద్వారానే పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా లోకల్ గైడ్ ఎడిటర్ చిలకమర్రి రామిరెడ్డి మాట్లాడుతూ  మన భారతదేశం లో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలు జాతీయ పండుగలని వెల్లడించారు.  భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు సమానత్వం సౌబ్రాతృత్వం అందించిన గ్రంథమే భారత రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగం స్ఫూర్తితోనే గ్రామాల పురుగు అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతోపాటు  ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో విజేతరైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల పెద్దలు వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News