బెల్లంపల్లి అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే ముఖ్యం. 

బెల్లంపల్లి అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే ముఖ్యం. 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34వార్డులు100శాతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమవుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే 13వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో 1లక్ష 73వేల మంది బెల్లంపల్లి ప్రజలందరు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నియోజకవర్గంలో పాటు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఒక సేవకుడిలా పనిచేస్తానని అన్నారు.2013 నుండి 2023 వరకు తెలంగాణ  పేరున బిఆర్ఎస్ వాళ్ళు ఓట్లు దండుకొని చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు.తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లిన ఘనత బిఆర్ఎస్ వాళ్ళకే ఉందన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన మూడు నెలల్లోనే ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లి పట్టణానికి 62కోట్లతో పైప్ లైన్ పనులు ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేని అన్నారు.మున్సిపాలిటీలో 34వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన వెంటనే 50కోట్ల నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయించే బాధ్యత తనదేనని అన్నారు.అదేవిధంగా పట్టణాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయడానికి 200కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తయారుగా ఉంచామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బండి ఉమాదేవి,టిపిసిసి ఓబీసీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్,పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News