రాష్ట్రంలో త్వరలో భర్తీ అయ్యే నామినేటెడ్ పోస్టుల్లో.  నల్గొండ జిల్లా బీసీలకు అవకాశం కల్పించాలి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి విజ్ఞప్తి చేసిన.

రాష్ట్రంలో త్వరలో భర్తీ అయ్యే నామినేటెడ్ పోస్టుల్లో.   నల్గొండ జిల్లా బీసీలకు అవకాశం కల్పించాలి 

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగంగౌడ్ 

మిర్యాలగూడ ఫిబ్రవరి 26
 (లోకల్ గైడ్ తెలంగాణ )

రాష్ట్రంలో త్వరలో భర్తీ అయ్యే నామినేటెడ్ పోస్టుల్లో నల్గొండ జిల్లా బీసీలకు శాతం అవకాశం కల్పించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని నిరూపించుకోవాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు.2023 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన కార్పొరేషన్ చైర్మన్ లలో ప్రాధాన్యత కలిగిన మరియు అధిక శాతం పదవులను ఒకే ఒక సామాజిక వర్గానికి కేటాయించారని నియమిత పదవులలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వకపోతే ఎలా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం.పేరుకే సామాజిక న్యాయం అని చెప్పుకొని తిరుగుతూ చేతల్లో చూపించకుంటే ఎట్లా అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీని నమ్ముకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన బీసీలకు మొదటగా మీ చేతిలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు  డైరెక్టర్ పదవులను బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి బీసీల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లాలో పార్టీలు మారిన అగ్రకులాలకు పదవులు ఇస్తున్నారు గాని మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ బీసీలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నల్గొండ జిల్లాలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు