ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం – సర్పంచ్ చాకలి బందయ్య హాజరు
లోకల్ గైడ్
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అర్హులైన నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
బోయ రమేష్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు లభించడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి సేవలు అందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం, సర్పంచ్ చాకలి బందయ్య, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, రమేష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
