_భారతీయ నాట్య వైభవం – 108 చిన్నారుల అద్భుత ప్రదర్శనతో తెలంగాణ వరల్డ్ రికార్డ్స్‌లో సాంస్కృతిక ఘనత

_ముఖ్యఅతిథిగా కదిరివెంకటరమణారావు జాతీయ కో-ఆర్డినేటర్ తెలంగాణ ప్రపంచ రికార్డులు అధ్యక్షుడు 

_భారతీయ నాట్య వైభవం – 108 చిన్నారుల అద్భుత ప్రదర్శనతో తెలంగాణ వరల్డ్ రికార్డ్స్‌లో సాంస్కృతిక ఘనత

IMG-20260224-WA0033కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 23( లోకల్ గైడ్ ప్రతినిధి)

శ్రీరాగరమ్య కల్చరల్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ రమ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతి ప్రధాన మందిరంలో జరిగిన “భారతీయ నాట్య వైభవం” సాంస్కృతిక మహోత్సవం ఘనంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 108 మంది చిన్నారులు మూడు గంటలపాటు నిరవధికంగా సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సంస్థ తెలంగాణ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావడం లక్ష్యంగా పెట్టుకుంది. చిన్నారుల సమిష్టి కృషి, క్రమశిక్షణ, నాట్య నైపుణ్యం ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రమ్య శ్రీ రాగ రమ్య కల్చరల్ హైదరాబాద్ సేవా కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతి వేదిక పైన భారతీయ నాట్య వైభవం అంటూ ఈరోజు 108 మంది చిన్నారులచే అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాముఅని అన్నారు, నాట్య రూపకర్తగా సురేష్ కృష్ణ విశేష పాత్ర పోషించారు. ఆయన రూపొందించిన నాట్య ప్రదర్శనల్లో భారతీయ సంప్రదాయ నృత్యాల అందం, భావ వ్యక్తీకరణ మరియు రాగాల సమన్వయం అద్భుతంగా ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా సురేష్ కృష్ణ మాట్లాడుతూ,ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, భారతీయ నాట్య కళాసంపదను గౌరవించే తరం తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం” అన్నారు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు రమ్య మాట్లాడుతూ, “108 మంది చిన్నారుల సమిష్టి ప్రదర్శన ఒక చరిత్ర సృష్టించే క్షణం. పిల్లల కృషి, తల్లిదండ్రుల సహకారం, గురువుల అంకితభావం కలిసినప్పుడు ఇలాంటి అద్భుతం సాధ్యమవుతుంది” అని తెలిపారు.
కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ వరల్డ్ రికార్డ్స్ నేషనల్ కోఆర్డినేటర్ వెంకట రమణారావు, మాట్లాడుతూ. రాగరమ్య సేవలు ఎంతో గొప్పవని
భారతీయ కళా సంస్కృతిని రక్షించేందుకే శ్రీ రాగరమ్య కల్చరల్‌ ఆకాడమీ సంస్థ అధినేత రాగరమ్య చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని వరల్డ్‌ రికార్డు సంస్థ కో ఆర్డినేటర్‌ రమణారావు ప్రశంసించారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతీలో 115 మంది కళాకారులు ఒకే వేదికపై చేస్తున్న నాట్యాన్ని తిలకించి “తెలంగాణ వరల్డ్‌ రికార్డ్స్‌ బుక్‌’లోస్థానం సంపాదించారు నాట్యగురువులు సురేష్‌ కృష్ణ, పూర్ణిమ, చందన లక్ష్మీలకు అభినందనలు తెలియజేశారు. ప్రముఖనాట్య గురువులు సురేష్ కృష్ణ, లక్ష్మీ చందన ,కె.వి పూర్ణిమ రామకృష్ణ తదితరులు హాజరై చిన్నారులను అభినందించారు.సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ నృత్య మహోత్సవం రాత్రి 10 గంటల వరకు కొనసాగి, చివర్లో అన్ని చిన్నారులు సమిష్టిగా చేసిన నాట్య సమర్పణతో ముగిసింది.ఈ సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణం భారతీయ నృత్య రాగాలతో మ్రోగిపోగా, ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో చిన్నారులను, గురువులను ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు
హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ మీడియా సంస్థకు అనుబంధం కాదని ఆ...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
కాంగ్రెస్ పార్టీ లోకీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో భారీ చేరికలు 
తెలంగాణ ఉద్యమంలో ‘దరువు’ పాత్ర అభినందనీయం
వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మండల సమితి సమావేశం.
మియాపూర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు