విధులు సక్రమంగా నిర్వహించడానికి ఐటీడీఏ కార్యాలయంలో బయోమెట్రిక్ 

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ రాహుల్

విధులు సక్రమంగా నిర్వహించడానికి ఐటీడీఏ కార్యాలయంలో బయోమెట్రిక్ 

భద్రాచలం : లోకల్ గైడ్ :
ఐటిడిఎ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో పని చేయుచున్న యూనిట్ అధికారులు, సిబ్బంది సమయాపాలన పాటించి విధులు సక్రమంగా నిర్వహించడానికి ఐటీడీఏ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసే మిషన్ ను కార్యాలయంలో ఏర్పాటు చేసారని, ఐటీడీఏ ప్రాజెక్టు బీ రాహుల్  తెలిపారు. సోమవారం  ఐటిడిఏ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయడానికి నూతనంగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మిషన్ ను ఆయన పరిశీలించి సిబ్బంది హాజరు వేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాలలో పనిచేయుచున్న యూనిట్ అధికారులు, సిబ్బంది కార్యాలయమునకు రాగానే ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి శాఖ అధికారితో పాటు వారి సిబ్బంది తప్పకుండా బయోమెట్రిక్ యాప్ లో పేర్లు నమోదు చేసుకోవాలని, బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయని అధికారులు మరియు సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, ఏ పీ ఓ పవర్ వేణు, మేనేజర్ ఆదినారాయణ సిబ్బంది రాజేష్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు