ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 16 :
సింగరేణి మండలం దుబ్బ తండా గ్రామపంచాయతీ మేకల తండా గ్రామ సూపరిచితుడు మన భూక్య రమేష్ (ఎల్ ఐ సీ ) దుబ్బ తండ లోని మాలోత్ శ్రీను సతీమణి మాలోత్ సుశీల మరణించిన విషయం తెలుసుకున్న ఎల్ ఐ సీ వెంటనే తన సహచర మిత్రులతో కలిసి సుశీలకు ఘనంగా నీవాళ్లు అర్పించడం జరిగింది. ఆపదంటే ముందుండి నేను ఉన్నాను అంటూ ఆ కుటుంబానికి ఓ పెద్ద కొడుకుల నిలుస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఎల్లప్పుడూ అండ దండగ ఎల్ ఐ సీ రమేష్ అందుబాటులో ఉండి వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుంటూ నిత్యం అందుబాటులో ఉంటు గ్రామ ప్రజల గుండెల్లో ఎల్ ఐ సీ చేరగని ముద్ర గా నిలుస్తున్నాడు. సుశీల మరణించటం చాలా బాధాకరమైన విషయం అనీ మన గ్రామ పంచాయతీలో ఆరోగ్యం పట్ల యావత్ ప్రజానీకము శ్రద్ధతో ఉండాలని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న తక్షణమే డాక్టర్ల ను సంప్రదించాలని వారి సలహా సూచన మేరకు వైద్య చేయించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ వైద్య శాలల్లో కార్పొరేటర్ స్థాయికీ మించి మెరుగైన వైద్యం లభిస్తుంది అనీ, చిన్న చిన్న తప్పిదలతో అజాగ్రత్తతో ఇప్పుడు సుశీల కుటుంబం పరిస్థితి చాలా బాధాకరమైన అంధకారంలో ఉండిపోవాల్ససిన పరిస్థితి ఏర్పడింది అనీ ఎల్ ఐ సీ గ్రామ ప్రజలకు హితావ్ పలికినాడు. తదనంతరం ఎల్ ఐ సీ ర మేష్ సుశీల కుటుంబ సభ్యులకు రూ.3,000 / ఆర్ధికంగా అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, నాయకులు భూక్య కబీర్, భూక్య శ్రీకాంత్, గూగులోత్ రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు, గుగులోతు కుమార్ , ముర్తు శాఖ డైరెక్టర్ భానోత్ రాంబాబు , మాజీ ఎం పీ టీ సీ రమేష్ , బానోత్ దూప్ సింగ్, తేజావత్ సాగర్ , అంకుత్ శంకర్, ఆంగోత్ శ్రీను, లక్ష్మ, తేజావత్ మంచ, బానోత్ సంతు, లావుడియా రాములు నాయక్, గుగులోతు వెంకట్, మాలోత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.