ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ పసవాలను పెంచాలి. 

నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ .

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ పసవాలను పెంచాలి. 

 

 


 నల్లగొండ ఉమ్మడి ప్రతినిధి .ఫిబ్రవరి 17 ( లోకల్ గైడ్).

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
 మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, పర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆరోగ్య ఉప కేంద్రంలోని  రిజిస్టర్లను, మందుల స్టాక్, స్టోర్, మరుగుదొడ్లు,  పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో అన్ని రికార్డులను సరిగా నిర్వహించాలని, మందుల స్టాక్ రిజిస్టర్ ను అప్డేట్ చేయాలని, గర్భిణీ స్త్రీలకు ప్రతినెల నిర్వహించే పరీక్షలను సక్రమంగా నిర్వహించి ప్రసవ సమయానికి  ప్రసవం జరిగేలా  చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలను పెంచాలని, పేద ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలోని మరుగుదొడ్లు తనిఖీ చేశారు. మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించిన సందర్భంగా ఆయా మందుల  వివరాలను, వాటి అందుబాటును, అడిగి తెలుసుకున్నారు.IMG-20260217-WA0172
 కాగా ఆరోగ్య ఉప కేంద్రం భవనం పై పెచ్చులు ఊగుతూన్నాయని, మరమ్మతులు చేయించాలని జిల్లా వైద్య  ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి , డాక్టర్ కృష్ణవేణి,జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, 
 మెడికల్ అధికారి రామకృష్ణ, ఎం ఎల్ హెచ్ పి ఊర్మిల, ప్రియదర్శిని, ఆశ, ఏఎన్ఎంలు, తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు