ఉద్యమానికి ఊపిరి పోయండి.

8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మణ్. 

ఉద్యమానికి ఊపిరి పోయండి.

ఉద్యమకారులతో కలిసి నామినేషన్ దాఖలు. 

లోకల్ గైడ్/తాండూర్:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు ఉద్యమించిన ఉద్యమకారులను ఆదరించండి అని 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, ఉద్యమకారుడు దోరేపల్లి లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎనిమిదో వార్డు నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే 11 తేదీన ఉద్యమకారుడు లక్ష్మణ్  కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడము. ఒక్క అవకాశం ఇస్తే కౌన్సిల్లో తమ గొంతు వినిపిస్తామని స్పష్టం చేశారు. మీ అమూల్యమైన ఓటు ద్వారా ఉద్యమానికి ఊపిరి పోయండి అని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కేశవ్, సీనియర్ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు