బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో.
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
మిర్యాలగూడ జనవరి 26
(లోకల్ గైడ్ తెలంగాణ )
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీ లో గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పనవిజయసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ, దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని కాపాడటమే బీ.ఆర్.ఎస్ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలతో రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న శక్తులను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీ.ఆర్.ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాలాపనతో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
