బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం
మేడ్చల్ జిల్లా, మూడుచింతలపల్లి : లోకల్ గైడ్ :
మూడు చింతల పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం అధ్వర్యంలో లక్ష్మాపూర్ తాండకు చెందిన పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. దీరావత్ అశోక్, ఉగ్లావత్ బాలు , లేకావత్ వెంకటేశం, లేకావత్ చందన్, బీఆర్ఎస్ నాయకులతో పాటు 10 మంది కాంగ్రెస్ లో చేరారు
ఏఎంసీ చైర్మన్ బొమ్మల పల్లి నర్సిములు యాదవ్, మూడుచింతల పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మూడు చింతలపల్లి అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తోపాటు, జిల్లా ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మన మున్సిపాలిటీ అభివృద్ధికి సుమారుగా రూ 15 కోట్లు నిధులు తేచ్చారని అన్నారు. ఇల్లులేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు దశలవారీగా కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని, మాయ మాటలు చెప్పి పదేళ్లు గడిపారని ప్రజలకు ఈ విషయం అర్థమై కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సంక్షేమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. స్వచ్ఛందంగా మేము అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి పార్టీలో చేరుతున్నామని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగ అవుతుందని, ప్రజల వద్ద దోచిన డబ్బుతో ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో గెలుద్దాం అనుకునే బీఆర్ఎస్ నాయకులకి ఓటమి భయం పట్టుకుందని, కచ్చితంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మూడు చింతల పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, లక్ష్మారెడ్డి, బస్వారెడ్డి, జర్రిపోతుల నర్సిములు, బాల్ రాజ్, బాబు, గణేష్, కటికల గోపి, రత్నాల మహేష్, యాదగిరి, సంతోష్ గౌడ్, లక్ష్మణ్, ప్రవీణ్ రెడ్డి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
