10వ తరగతి(SSC)పరీక్షల సందర్భంగా 163 BNSS సెక్షన్ అమలు

10వ తరగతి(SSC)పరీక్షల సందర్భంగా 163 BNSS సెక్షన్ అమలు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి నరేష్:(లోకల్ గైడ్ తెలంగాణ)

మార్చి 12: సిద్దిపేట జిల్లాలో జరగనున్న పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ) వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ 163 BNSS సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 82 పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు.
ఈ ఆంక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్ష జరిగే ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమలులో ఉంటాయి. పరీక్షా కేంద్రాల సమీపంలో కర్రలు, రాళ్లు, ఆయుధాలు తీసుకెళ్లడం, పరీక్షలకు సంబంధించిన నిషేధిత కాగితాలు కలిగి ఉండటం నేరమని తెలిపారు. అలాగే పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ ఉత్తర్వుల నుండి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News