ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా లాలప్ప.
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు .
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ గ్రామపంచాయతీ కార్యదర్శి లాలప్ప ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. పంచాయతీ కార్యదర్శిగా తన అంకితభావం, నిబద్ధతతో కూడిన సేవలకు గాను ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ మేరకు, కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా సోమవారం అవార్డ్ అందుకున్నారు.కాగా
గ్రామ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. విధుల్లో పారదర్శకత, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం లాలప్ప పనితనానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
ఈ అవార్డు పెద్దెముల్ గ్రామానికే గర్వకారణమని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ లాలప్పను ఘనంగా అభినందించారు. ఆయన సేవలు ఇతర పంచాయతీ కార్యదర్శులకు ఆదర్శంగా నిలుస్తాయని పలువురు ప్రశంసించారు.
