వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధించిన కొడుకులు – కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధించిన కొడుకులు – కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు

 

సిద్దిపేట జిల్లా ప్రతినిధి మార్చి14

ఆస్తి రాసిచ్చిన అనంతరం కన్నతండ్రి, తల్లిని పట్టించుకోకుండా కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94) కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్ గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. నారాయణరెడ్డి తనకు ఉన్న 7 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా చెరి 3½ ఎకరాలు చొప్పున రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.వయస్సు పైబడటంతో తమను చూసుకుంటారని భావించి ఆస్తి అప్పగించగా, కొడుకులు మాట మార్చారని నారాయణరెడ్డి తెలిపారు. తమను ఒక పాత ఇంట్లో ఉంచి కనీస సౌకర్యాలు కల్పించకుండా, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే బూతు మాటలతో దూషిస్తూ, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉండటంతో అధికారులు స్వయంగా నారాయణరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఫిర్యాదును స్వీకరించారు.నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను తెలిపారు.

Tags:

About The Author

Latest News