మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
హైదరాబాద్లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కిక్కర్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 3వ జాతీయస్థాయి ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లోని షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు ఇంటర్నేషనల్ రిఫ్రిస్ టి.రాజేష్, ఎం.కన్నన్ గౌడ్, కే.శ్రీనివాస్, ఏ.శ్రీధర్, జె.శ్రీనివాస్, మరియు కార్యక్రమ నిర్వాహకులు బి.నాగరాజు చేతుల మీదుగా జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల పేర్లు :
బాలుర డి గ్రూప్ కటాస్ విభాగంలో
1. సిలివేరు యోగేందర్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
బాలుర ఎఫ్ గ్రూప్ కటాస్ విభాగంలో
2. తలారి చేతన్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
బాలికల ఈ గ్రూప్ కటాస్ విభాగంలో
1. మొండి కత్తి హిమ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్స్ చిలువేరు యాదయ్య, యాస శ్రీనివాస్ రెడ్డి, గడ్డం త్రిమూర్తి, కుక్క పల్లి నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ విద్యను అభ్యసించి తమ శక్తి సామర్థ్యాలు మెరుగుపరచుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు.
సిలువేరు నరసింహ, సిలివేరు అనిత, మొండి కత్తి పవన్, మొండి కత్తి వాణిశ్రీ, తలారి వెంకటేశం, తలారి అనిత మరియు శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యను ఇష్టంతో నేర్చుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చు కావున విద్యార్థులు ఏకాగ్రతతో మార్షల్ ఆర్ట్స్ విద్యను అభ్యసించాలని కోరారు. మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
