బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఆకుల మహేష్ కుమార్ ఎన్నిక

శుభాకాంక్షలు తెలిపిన..బి నారాయణ, కె చెన్నారెడ్డి, కృష్ణ, వి నరేందర్

బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఆకుల మహేష్ కుమార్ ఎన్నిక

హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

రంగారెడ్డి ప్రాంతానికి చెందిన న్యాయవాది ఆకుల మహేష్ కుమార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు బి.నారాయణ, కె.చెన్నారెడ్డి, జర్నలిస్ట్ కృష్ణ, వి.నరేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలలో ఆకుల మహేష్ కుమార్ మొత్తం 1085 ఓట్లతో విజయం సాధించారు. ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఆయనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఎన్నికలలో 708, 293, 1001 వంటి ఓట్ల తేడాతో ఇతర అభ్యర్థులు ఉన్నప్పటికీ, మహేష్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా బి.నారాయణ,  చెన్నారెడ్డి, కృష్ణ, వి.నరేందర్ మాట్లాడుతూ..ఆకుల మహేష్ కుమార్ న్యాయవాద వృత్తిలో కష్టపడి పనిచేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన అంకితభావం, నిబద్ధత వల్లే న్యాయవాదుల నుండి విశేష మద్దతు లభించి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, న్యాయవ్యవస్థ బలోపేతానికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకుల మహేష్ కుమార్ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News