మున్సిపాలిటీల పరిధిలోని విద్యాసంస్థలన్నిటికీ ఈనెల 10 11వ తేదీలలో సెలవులు.

మున్సిపాలిటీల పరిధిలోని విద్యాసంస్థలన్నిటికీ ఈనెల 10 11వ తేదీలలో సెలవులు.


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .ఫిబ్రవరి 9. (లోకల్ గైడ్)


           మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని విద్యాసంస్థలన్నింటికీ ఈనెల 10, 11 తేదీలలో  2 రోజులు స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్ర శేఖర్ తెలిపారు.జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ హలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల, మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలకు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ  పోలింగ్ ముందు రోజైన ఫిబ్రవరి 10, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:

About The Author

Latest News