పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి15(లోకల్ గైడ్ తెలంగాణ) 

ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో గల వెనుకబడిన అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వివిధ శాఖల వసతిగృహాలు ఒకే భవనంలో వేర్వేరు అంతస్తుల్లో నిర్వహించబడుతున్నందున బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వార్డెన్లకు సూచించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులను కొలతల ప్రకారం అందించి, రోజువారీ కామన్ డైట్ మెనూను పాటిస్తూ రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు.
వంటగది పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్, అక్కడే సిబ్బందితో శుభ్రపరిచే పనులు చేయించారు. ఎల్లప్పుడూ వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలని వంట సిబ్బందికి సూచించారు.
స్టోర్ రూమ్‌లో సరుకులను తనిఖీ చేసిన కలెక్టర్, నాణ్యమైన ఆహార పదార్థాలనే వినియోగించాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని వార్డెన్లను హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News

పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి15(లోకల్ గైడ్ తెలంగాణ)  ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో గల వెనుకబడిన అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి...
సింగరేణి మండలం సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం 
శిక్షణ ను సద్వినియోగం చేసుకొని జనగణన పకడ్బందీగా
మెట్ల దారిన.. మొక్కుల దేవుని చెంతకు! శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి
యరసానిగూడెం గ్రామంలో ఉచిత చెవి–ముక్కు–గొంతు వైద్య శిబిరం.
ఘనంగా గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవం.
చలివేంద్రం ప్రారంభించిన సారపాక సర్పంచ్ ఉపసర్పంచ్