శిక్షణ ను సద్వినియోగం చేసుకొని జనగణన పకడ్బందీగా
చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, మార్చి - 15:లోకల్ గైడ్ :
శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, జనగణన-2027 ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన గణన అధికారి అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు చేపట్టిన 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
శిక్షణ లో ఛార్జ్ అధికారులైన తహశీల్దార్లు, అదనపు ఛార్జ్ అధికారులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మునిసిపల్ పరిధిలోని మునిసిపల్ కమిషనర్లు, మేనేజర్లు హాజరుకాగా, డైరెక్టరేట్ జనగణన విభాగం సంయుక్త సంచాలకులు శ్రీకాంత్, మాస్టర్ ట్రైనర్ రవికుమార్ శిక్షణ ను ఇవ్వనున్నారు.
శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గణనాధికారి ఏ. శ్రీనివాస్ ఏ. శ్రీనివాస్ సమన్వయం చేస్తూ, జనగణన యొక్క ప్రాముఖ్యత, ఇందులో వివిధ అధికారుల పాత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
