ఘనంగా గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవం.
నూకల అభినవరెడ్డి.
లోకల్ గైడ్ జిల్లా ప్రతినిధి మహబూబాబాద్
- కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నూకల అభినవరెడ్డి
- ఘనంగా గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవం.
- గంగమ్మ ఆశీస్సులతో అంతా శుభమే
మరిపెడ : మండలంలోని పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారు ఆకేరు వాగు సమీపంలోని గంగమ్మ ఆలయం తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభినవరెడ్డి మాట్లాడుతూ గంగమ్మ తల్లి దీవెనలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు గంగమ్మ దేవతకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వార్షికోత్సవ వేడుకలలో పురుషోత్తమాయ గూడెం గ్రామస్తులతో పాటు సీతారాం తండావాసులు, గ్రామ సర్పంచ్ వెన్నెల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలం రవీందర్ రెడ్డి, గంధసిరి అంబరీష, మెంచు అశోక్ కుమార్ గౌడ్, పటేల్ దుర్గయ్య, పిట్టల శీను, రజక శ్రీనివాస్,కళాధర్, రామ్మూర్తి, లింగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
